సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోల మధ్య, స్టార్ హీరోయిన్ల మధ్య,దర్శకుల మధ్య, నిర్మాతల మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు ఇది కొన్ని కొన్ని సార్లు గొడవలకు కూడా దారితీస్తుంది. కానీ ఈ స్టార్ హీరోల మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ దాదాపు 8-9 సంవత్సరాల నుండి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అయితే వీరి తండ్రులు ప్రాణ మిత్రులు అయినప్పటికీ కొడుకులు మాత్రం కనీసం మాట్లాడుకోవడం లేదు. ఇంతకీ వారు ఎవరో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇప్పటికీ కొనసాగుతున్న బాలకృష్ణ నాగార్జున( Nagarjuna-Balakrishna) . వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందో తెలియదు కానీ చాలా రోజుల నుండి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఉన్న దూరం చాలా సందర్భాలలో బయటపడింది. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా బాలకృష్ణ రాలేదు. అలాగే నాగార్జున తన తండ్రి పేరు మీద నిర్వహించిన ఓ ఫంక్షన్ కి ఇండస్ట్రీలో ఉన్న అందరిని పిలిచి బాలకృష్ణ ని మాత్రం పిలవలేదు. అలాగే ఇప్పటివరకు వీళ్ళిద్దరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఒకరింటికి మరొకరు వెళ్లిన సందర్భాలు లేవు. ఎప్పుడో నాగచైతన్య ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో జోష్ సినిమా ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు.
అంతే తప్ప మళ్ళీ ఇప్పటివరకు వీరికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంలో కూడా బాలకృష్ణ పాల్గొనలేదు. అలాగే ఓ సినీ పెద్ద ఇంట్లో పార్టీ ఇస్తే అక్కడికి బాలకృష్ణ నాగార్జున (Nagarjuna-Balakrishna)ఇద్దరు వెళ్లారు. అయితే అదే రోజు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయట నిజమేనా అని సన్నిహితులు అడిగితే మా మధ్య అలాంటి గొడవలు ఏమీ లేవు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు తప్పా వీరి మొహాలలో చిరునవ్వు లేదు. ఇక వీటన్నింటినీ బట్టి వీరి మధ్య ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా వీరి మధ్య ఉన్న గొడవ మరొకసారి బయటపడింది అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్. అదేంటంటే నాగార్జున బిగ్ బాస్ (Biggboss7) సీజన్ కి హోస్టుగా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే సీజన్ 7 కి నాగార్జున హోస్టుగా చేయడం లేదంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలోనే బాలకృష్ణని సీజన్ 7 కి హోస్ట్ గా చేయమని బిగ్ బాస్ యాజమాన్యం కలిసిందట.కానీ బాలకృష్ణ సీజన్ 7 కి హోస్టింగ్ చేయడానికి ఒకే ఒక కండిషన్ పెట్టారట. అదేంటంటే..నేను బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్టింగ్ చేస్తాను కానీ బిగ్ బాస్ సెట్ మాత్రం అన్నపూర్ణ స్టూడియో (Annapoorna Studio) లో ఉండకూడదు అని ఒకే ఒక షరతు పెట్టారని ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎంత దూరం ఉందో.