ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అనేక రకాల ఫుడ్ లు తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పుడ్ ను తింటూ ఉంటారు. అనేర రకాల కొత్త వంటకాలు భారత్ లో లభిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల ర్యాంకులను ప్రకించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఇటలీ నిలవగా.. రెండో స్థానంలో గ్రీస్, మూడో స్థానంలో స్పెయిన్ నిలిచింది. ఇక నాలుగో స్థానంలో స్పెయిన్, ఐదో స్థానంలో భారత్ నిలిచినట్లు టేస్ట్ అట్లాస్-2022 నివేదిక బయటపెట్టింది. ప్రపంచంలోనే భారత్ 4.5 పాయింట్లను సాధించింది. నెయ్యి, గరం మసాలా, మలాయ్. బటర్ గార్లిక్ నాన్, కీమా వంటి వంటకాలు మంచి రేటింగ్ సంపాదించాయి.
మూడు కేటగిరిల్లో వంటకాలకు రేటింగ్ ఇచ్చారు. ఇక బెస్ట్ రెస్టారెంట్లుగా ముంబైలోని శ్రీ థాకర్ భోజనాలయ్. బెంగళూరులోని కరవల్లి, న్యూఢిల్లీలోని బుఖారా, దమ్ ఫుఖ్త్, గురుగ్రామ్ లోని కొమోరిన్ రెస్టారెంట్లు నిలిచాయి. వీటితో పాటు 450 రెస్టారెంట్లు ప్రపంచంలోని అత్యత్తమ రెస్టారెంట్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. చైనీస్ వంటకాలు టాప్ 11లో ఉండగా…. మెక్సికో. టర్కీ, ఫ్రాన్స్, పెరు. యూఎస్ఏ దేశాలు టాప్ 10లో ఉన్నాయి. అయితే ఈ జాబితాపై పలువురు విమర్శలు కూడా చేస్తోన్నారు. కొంతమంది దీనిని సమర్ధిస్తుండగా..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.తమ దేశ వంటకాలు బాగుంటాయని, అయినా జాబితాలో స్థానం కల్పించలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ జాబితాకు సంబంధించి ట్వీట్ వైరల్ గా మారింది. 32 వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. భారత్ వంటకాలు చాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాియ.