CINEMA

స్టైలిష్ గా వాల్తేరు వీరయ్య సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ ఈరోజు చెప్పిన టైం కు సినిమా బృందం విడుదల చేసింది.

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి. ఈ మూడవ పాట కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా అది రెండు పాటలకు మించి ఉండడం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం గా మారుతుంది.(Waltair Veerayya Title Song)

మరి సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు మూడు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించక పోవడం తో ఈ సినిమా పట్ల అందరూ ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి చిత్రం కూడా విడుదల కాబోతూ ఉండడం విశేషం. ఈ రెండు సినిమాలను కూడా ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు ఆ నిర్మాణ సంస్థకు ఎలాంటి కలెక్షన్ ను తెచ్చిపెడతాయో చూడాలి.