కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన…

