ఒక్క ఎముకతో డైనోసార్ల చరిత్ర రహస్యం..! ఎలా బయటపడిందంటే..!
ఈరోజు డైనోసార్ల గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారీ శిలాజాలు దొరికినా అవి ఏ జీవికి చెందినవో శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటి ఆసక్తికర సంఘటనే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో జరిగింది. తర్వాత అదే శిలాజం చరిత్రలో నమోదైన తొలి డైనోసార్ ఆనవాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1676లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సున్నపురాయి గనిలో కార్మికులు భారీ కాలి ఎముకను వెలికితీశారు. ఈ శిలాజాన్ని ప్రకృతి శాస్త్రవేత్త…

