ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు..! మంత్రి సీతక్క కీలక ప్రకటన..
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన, భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల జీవితాల్లో భరోసా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు. సమాజంలో ఎటువంటి ఆసరా లేక ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ…

