AP

రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరంలో నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్,సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ ఆధ్వర్యంలో రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు.డెల్టా హాస్పిటల్ జనరల్ మేనేజర్ క్రాంతికుమార్,యాక్టివిటీస్ మేనేజర్ శివప్రసాద్ సూచనలతో డాక్టర్ కె.వి.డి వరప్రసాద్ పలు రకాల
వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు,మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ మెడికల్ క్యాంప్ కి సహకరించిన డెల్టా హాస్పిటల్ వారిని, జన సైనికుడు గంగిరెడ్ల మణికంఠని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రెటరీ నల్లల రామకృష్ణ ,జాయింట్ సెక్రెటరీ దాసం శేషారావు,యర్రవరం గ్రామ జనసైనికులు
పాల్గొన్నారు.