ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఈ రోజు అనగా 31.01.2023 వ తేది నాడు ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ జి వి యస్ పైడేశ్వరరావు గారు,భీమడోలు సీఐ వి వెంకటేశ్వరరావు గారు ద్వారక తిరుమల ఎస్ఐ సుదీర్ గారు వారి యొక్క సిబ్బంది తో సిహెచ్ పోతేపల్లి గ్రామంలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ ప్లాంట్ కర్మాగారం నందు హెల్మెట్ ధరించడం వలన కలిగి ఉపయోగాలను గురించి ద్విచక్ర వాహనాలు వాడుతున్న కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు
👉 ఈ కార్యక్రమంలో ఏలూరు ఇన్చార్జి డిఎస్పి గారు మాట్లాడుతూ ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుట కొరకు రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రజలకు అవగాహనను కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలపై నిర్వహిస్తున్నట్లు,
👉 వాహనాలు నడిపే సమయంలో ఒకరు చేసిన తప్పుకు ఎదుటివారు శిక్ష అనుభవిస్తున్నట్లు వేగం వద్దు ప్రాణం వద్దు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని వాహనం నడిపే సమయంలో మీ పైన ఆధారపడే వారు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహించాలని,
👉 ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం వలన ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుకోగలుగుతామని,
👉 హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను గురించి కార్మికులకు అవగాహనను కలగ చేసినారు