చంద్రబాబుకు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్న ప్రభుత్వం
జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 13: జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగ్గంపేట లో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఎన్టీఆర్ కాంస్య విగ్రహం స్మారక మందిరం పనులు కాకినాడ రోడ్ లోని హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన కార్యకర్తల సమావేశ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రు జోనల్ ఇంచార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కలిసి ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్స్ గంటా గౌతమ్ పరుచూరి కృష్ణ, ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు పర్యటన యధాతధంగా సాగుతుందని అందులో భాగంగా పర్యటన ఏర్పాట్లు పరిశించామని అలాగే సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ తన నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు 2650 మంది తో సమావేశం నిర్వహించడానికి చక్కని సభా వేదిక ఏర్పాటు చేశారని ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన తట్టుకోలేక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నరని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు లోకేష్ కి వస్తున్న జనాదరణ చూసి వార్వలేని ఈ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెడుతూ మైకు లాక్కోవడం వాహనాలు సీజ్ చేయడం చీకటి జీవోలు తీసుకొస్తుందని అయినా ప్రజా మద్దతుతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. మూడు రోజుల చంద్రబాబు పర్యటన ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, సుంకవిల్లి రాజారావు( రాజు), దాపర్తి సీతారామయ్య, ఎస్వీ ప్రసాద్, మండపాక అప్పన్న దొర, వైభోగుల కొండబాబు యాదవ్, కురుమళ్ళ నాగేశ్వరరావు డేగల సత్తిబాబు, మానేపల్లి సాయి నలమాటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.