AP

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లా
రిపోర్టర్.రాంప్రసాద్

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొతారపు ప్రసాద్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోమ్ లో జరిగిన జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రథమ జిల్లా సమావేశానికి ముఖ్య వక్తగా ఆయన హాజరయ్యారు.సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ..సహ చట్టం వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు.అధికార వికేంద్రీకరణతో నిధులు సక్రమంగా ఉపయోగించుకొనే పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందని తెలిపారు. మరో వక్త స్థానిక ప్రముఖ న్యాయవాది టి. జోగారావు మాట్లాడుతూ. చట్టాల పట్ల ప్రజలకు ఈ సంస్థ ద్వారా మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లా గౌరవ అధ్యక్షులుగా టి.జోగారావు , అధ్యక్షులుగా పి. సుధీర్ , ప్రధాన కార్యదర్శిగా కే.బాబ్జి , కోశాధికారిగా పి. వెంకటేశ్వరరావు , జిల్లా ఉపాధ్యక్షులుగా కే. వైకుంఠరావు ను ఎన్నుకోవడం జరిగింది.