AP

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…,

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని
అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…,
ముఖ్య అతిధిగా పాల్గొన్న దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర..

ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ ముసునిగుంట గ్రామంలో లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల నందు జరిగింది.

ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ.టి.డబ్ల్యూ.ఓ సిహెచ్.రామ తులసి, దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి,దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర హాజరయ్యారు.ఈ సమావేశంలో విద్యార్థినుల ఎదుర్కొంటున్న సమస్యలను తల్లిదండ్రులు ఏ.టి.డబ్ల్యు.ఓ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం తల్లిదండ్రులు వారి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవలెనని ఏ.టి.డబ్ల్యూ.ఓ కు వినతి పత్రం అందజేశారు.

ముఖ్యంగా
(1) ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టును యుద్ధ ప్రాతిపదికన భర్తీ చెయ్యాలనీ,

(2) మేల్ నైట్ వాచ్ మెన్ ను నియమించాలనీ.
(3) హాస్టల్ చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచాలి నిర్మించాలనీ.
(4) హాస్టల్లో సి.సి టీవీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలానీ.
(5) ప్రతి ఆదివారం మరియు రెండో శనివారం మా పిల్లలను మా తల్లులు కలిసే విధంగా అవకాశం కల్పించాలనీ.
(6) మెనూ ప్రకారం సక్రమంగా ఆహారం అందించాలనీ.
(7) మా పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే మాకు తెలియజేసీ ఇంటికి పంపించాలని,
విద్యార్థినుల తల్లిదండ్రులు రంపచోడవరం ఐటీడీఏ ఏ.టి.డబ్ల్యూ.ఓ డబ్ల్యు సిహెచ్.రామ తులసి కి వినతి పత్రం ఇచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, వార్డెన్ మరియు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు.