AP

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!

ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్‌ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి చూపించింది. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులైన హైదరాబాద్‌ పేసర్‌ యషశ్రీ, విశాఖపట్నం పేసర్‌ షబ్నమ్‌ను కనీస ధర రూ.10 లక్షలకు వరుసగా యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ సొంతం చేసుకున్నాయి. జాతీయ జట్టుకు ఆడిన హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డిని కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది.

ఆంధ్ర బ్యాటర్‌ సబ్బినేని మేఘనను కనీస ధర రూ.30 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుక్కుంది. కానీ అండర్‌-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకు నిరాశే మిగిలింది. ఫ్రాంచైజీలు ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. Also Read: Eoin Morgan: ఇంగ్లండ్‌ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ కాగా వేలంలో రూ.3.4 కోట్లతో భారత్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా టాప్ లో నిలిచింది. ఆమెను బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది.ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా రూ.2.6 కోట్లతో ఆశ్చర్యపరిచింది. టీమిండియా యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్ లో మొత్తం ఐదు టీమ్స్ ఆడనున్నాయి. ఇందులో మూడు టీమ్స్ ను ఇప్పటికే ఐపీఎల్లో ఉన్న ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసాయి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ డబ్ల్యూపీఎల్లో ఆడనున్నాయి.