AP

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే,ఆర్థిక మంత్రి,పోలీసులే బాధ్యత వహించాలన్న తెలుగుదేశం పార్టీ డోన్ టిడిపి అభ్యర్థి ధర్మపురం సుబ్బారెడ్డి, నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అంబాపురం కె శ్రీనివాసులు ప్రపోజల్స్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లను నిన్న రాత్రి పోలీసులు పిలుచుకు పోవడంతో వారి కుటుంబ సభ్యులు, వలసల రామకృష్ణ, గండికోట రామ సుబ్బయ్య, ప్రజా వైద్యశాల మల్లికార్జున, గంధం శ్రీనివాసులు, బేతంచెర్ల షెక్షావలి చౌదరి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి స్థానిక డిఎస్పి ఆఫీసులో ఫిర్యాదు చేశారు,అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన అనంతరం ధర్మవరం సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబాపురం కె శ్రీనివాసులు ను ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ లో బలపరిచిన ఎంపీటీసీలను, కౌన్సిలర్లను అర్ధరాత్రి వారి ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎంపీటీసీలు కౌన్సిలర్ల ను,వారి కుటుంబ సభ్యులను భయ భ్రాంతులకు గురిచేసి తీసుకు పోయారని ఇంతవరకు వారి అచూకీ కనపడటం లేదని వారికేదైనా జరిగితే ఆర్థిక మంత్రి బుగ్గన,పోలీసులే బాధ్యత వహించాలని,బిసి లుగా పోటీ చేసిన సర్పంచులను ఇబ్బంది పెట్టి,వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం తగదని, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను గ్చిత్ర హంసలు పెట్టి వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేశారని,పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని,ఆర్థిక మంత్రి బుగ్గనా దమ్ము ధైర్యం ఉంటే అధికారులను పక్కనపెట్టి రా తేల్చుకుందామని ఘాటైన సవాల్ విసిరిన డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, మృదుభాషి,సౌమ్యంగా కనిపించే ధర్మవరం సుబ్బారెడ్డి తమ వారికి అన్యాయం జరిగిందన్న ఈ సందర్భంలో పరుష పదజాలంతో ఘాటుగా స్పందించడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చర్చించుకుంటున్న డోన్ నియోజకవర్గ, పట్టణ ప్రజలు,