AP

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల..

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 07:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం అందివ్వాలని ఉత్తర్వులు జారీచేసింది విద్యాశాఖ. ఒకటవ తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY పాఠశాలలను ప్రకటించాలని నిర్ణయించింది.

 

రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు వుంటాయి. ప్రత్యేకంగా SSC పరీక్షా కేంద్రాలు (రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాలు) ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలి. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్‌ను అనుసరిస్తాయి.