2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023–24 ను రాష్ట్ర సీఎం జగన్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను పొందు పరచిన క్యాలెండర్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.