విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు అంతర్గత ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఈ కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి..