AP

ఏపీలో గోవుల అక్రమ రవాణా హైకోర్టు లో విచారణ..

ఏపీలో గోవుల అక్రమ రవాణా, సంతలు నిలుపుదల చేయా లని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్రం గెజిట్ కు విరుద్ధంగా ఫిట్ నెట్ సర్టిఫికెట్లు ఇస్తున్న వారిపై ఏం కేసులు నమోదు చేశారు తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

 

దేశంలో, రాష్ట్రంలో గోవులు, వివిధ జంతువులకు లంపీ స్కిన్ వ్యాధి సొకటంతో జంతువుల రవాణా నిలుపుదల చేస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. వెటర్నరీ డాక్టర్లు గెజిట్ కు విరుద్ధంగా ఫిట్ నెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది హైకోర్ట్.