బెంగళూరు/శివమొగ్గ: మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన కుమారుడు కే.ఇ. కాంతేష్ ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇప్పటి నుంచే టికెట్ కోసం ప్రయత్నాలు చేయనున్న సంగతి తెలిసిందే.
కాంతేష్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప సోమవారం హవేరిలో చెప్పారు. హావేరిలో ఈశ్వరప్ప విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం నా కుమారుడు కాంతేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు.
భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి!
తన కుమారుడు కాంతేష్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీని ద్వారా కొడుకు కాంతేష్ అభ్యర్థిత్వం కోసం ఈశ్వరప్ప అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని వెలుగు చూసింది. హవేరీ నియోజకవర్గం నుంచి కాంతేష్ లోక్‌సభకు పోటీ చేస్తారని ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ సిట్టింగ్ ఎంపీ శివకుమార్ ఉదాసి నిర్ణయించుకున్నారని ఈశ్వరప్ప తెలిపారు.
మా ఎంపీ శివకుమార్ ఉదాసితో మాట్లాడాను. వ్యక్తిగత సమస్యల కారణంగా తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన తనతో చెప్పారని ఈశ్వరప్ప అన్నారు. కాంతేష్‌తో పాటు పలువురు టికెట్ ఆశించేవారు ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి అనే విషయంలో నిర్ణయం తీసుకుంటారని, తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ఎంపీ శివకుమార్ ఇప్పటికే నేతలకు తెలియజేసారని, టిక్కెట్లు ఆశించేవారు చాలా మంది ఉన్నారని, నా కుమారుడు టిక్కెట్ ఆశించడంలో తప్పేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప అన్నారు.