AP

టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!

టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు.

ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచ్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది.

రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్‌ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

జూలై 6న తిరుపతి ఐఐటీలో ఆ సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి డైరెక్టర్‌ శంతన్‌ భట్టాచార్య, మద్రాస్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ మంగళ్‌తో ప్రవీణ్‌ ప్రకాశ్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి సమావేశమయ్యారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, ఐఐటీ ప్రొఫెసర్లతో 35,000 మంది సబ్జెక్టు టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని ప్రవీణ్‌ ప్రకాశ్‌ చెప్పారు.

విద్యార్థుల భావోద్వేగాలను, వారి మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ ప్రతిస్పందించడం లాంటి వాటిపై ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సృజనాత్మకత పెంపు, బోధనను కళాత్మకంగా ఆకర్షణీయంగా నిర్వహించడం కూడా చేస్తోంది.