తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
ఈ నెల 10వ తేదీన ఉదం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది ధర్మాసనం.
శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యుత్ సంఘాలు భావించాయి. విజయవాడ ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. నిన్న విచారణ సమయంలో ధర్నాకు శుక్రవారం కాకుండా మరో రోజు నిర్ణయించుకోవాలని సూచించిన హైకోర్టు ధర్నాకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.