AP

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పు

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పుచేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు మార్గాలు నిర్మించడంతో వీటిని జంక్షన్లుగా మారుస్తూ ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీచేశారు.

ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్ల చివరన జంక్షన్‌ అని అదనంగా చేరుతుంది. న్యూ పిడుగురాళ్ల, విష్ణుపురం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. నంద్యాల, శావల్యాపురం స్టేషన్లు గుంటూరు నుంచి డోన్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. డోన్ వైపు, హైదరాబాద్ వైపు వెళ్లడానికి నల్లపాడు స్టేషన్ నుంచి వెళతారు.

ఈనెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సికింద్రాబాద్‌-రామనాథపురం -సికింద్రాబాద్‌ 07695, 07696 మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడపనున్నారు. ప్రతి బుధవారం సికింద్రాబాద్ లో రాత్రి 21.10 గంటలకు బయలుదేరి గుంటూరు కు 1.50, రామనాథపురంకు 23.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రామనాథపురంలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి గుంటూరుకు తర్వాతరోజు తెల్లవారాజామున 5.10 గంటలకు, సికింద్రాబాద్ 12.50 గంటలకు చేరుకుంటుంది.

గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరుతోపాటు విజయవాడ-చెన్నై-విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్ సిటీ, జనశతాబ్ది రైళ్లను కలిపేసి ఒకే రైలుగా నడపాలని గుంటూరు రైల్వే డివిజన్ ప్రతిపాదించింది. దీనివల్ల అటు చెన్నైకి, ఇటు సికింద్రాబాద్ కు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్-చెన్నై సెంట్రల్ ఇంటర్ సిటీగా న్యూగుంటూరు స్టేషన్ మీదగా నడిపించనున్నారు.