AP

ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ

అమరావతి: ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంగాటి శ్రీదేవి, ధనలక్ష్మి మాట్లాడారు.

తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును చీటర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లను జగన్‌ తుడిచారని చెప్పారు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

అమ్మఒడి, చేయూత.. వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఆడబిడ్డ కష్టాలను తీర్చుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఏమిటో చేతల్లో చేసి చూపించారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యారని, 14 సంవత్సరాల హయాంలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేననే విషయం మహిళలందరికీ తెలుసునని గుర్తు చేశారు. ఆయనను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని స్పష్టం చేశారు. పసుపు కుంకుమ పేరుతో మహిళా లోకాన్ని మోసం చేశాడని ధ్వజమెత్తారు.

టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణపై రోజా విమర్శలు గుప్పించారు. ఆయనపై సెటైర్లు సంధించారు. మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారంటూ చురకలు అంటించారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, చేయని పనుల గురించి కూడా చెప్పుకొంటారని విమర్శించారు.

వైఎస్ జగన్‌ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా? అంటూ రోజా సవాల్ విసిరారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ అని అభివర్ణించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా ఏపీలోనే మహిళలకు రాజకీయంగా జగన్‌ ఎన్నో అవకాశాలు ఇచ్చారని అన్నారు.

చంద్రబాబు పబ్లిసిటీ – జగనన్న క్రెడిబులిటీ, చంద్రబాబు గోబెల్స్ – జగనన్న నోబెల్, చంద్రబాబు చీటర్ – జగనన్న లీడర్ అని పేర్కొన్నారు రోజా. భవిష్యత్‌కు గ్యారెంటీ అని చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకే భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్ వన్స్‌మోర్-