AP

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీలో నచ్చక తాను బయటకు వచ్చానని, ప్రస్తుతం కూడా తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రోజు మహిళా నేతలు బండారు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు.

లోకేష్ నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా? నీ ఫ్యామిలీని అంటే ఊరుకుంటావా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ మీద దాడి చేస్తారా అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారని కానీ టీడీపీ నేతలకు మహిళలను గౌరవించడం రాదని మంత్రి రోజా పేర్కొన్నారు.

మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారని రోజా అసహనం వ్యక్తం చేశారు. ,మాట్లాడితే సినిమా వాళ్ళు అంటున్నారని పేర్కొన్న రోజా తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీఆర్ అని, ఆయన సినిమా వాళ్లు కాదా అని ప్రశ్నించారు. మంత్రి బండారు భార్యను అడుగుతున్నా అని పేర్కొన్న రోజా ఆరోజు నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన ఇంకెవరికి రాదు అంటూ పేర్కొన్నారు.

బండారు వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారని రాజకీయాల్లో తాను 20 ఏళ్లుగా ఉన్నానని రాజకీయంగా మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు అన్నం కూడా పెట్టిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. నన్ను తిట్టడానికి అయ్యన్నపాత్రుడు బండారు సత్యనారాయణ వంటి వారిని ఉసిగొల్పుతోందని తెలిపారు .ఆడ పుట్టుక నే అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అని రోజా పేర్కొన్నారు.

ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ అని, మహిళలంటే చిన్నచూపు చూసే టిడిపిలో మహిళలకు గౌరవం ఎలా ఉంటుందని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రతి మహిళకు మనసు ఉంటుందని పేర్కొన్న రోజా, దమ్ముంటే నా నియోజకవర్గానికి రండి అభివృద్ధి చూడండి దానిపై చర్చ పెట్టండి అంటూ రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన గొంతు నొక్కాలని చూస్తే కోర్టుకు ఈడుస్తానని, పరువు నష్టం దావా వేస్తానని మంత్రి రోజా హెచ్చరికలు జారీ చేశారు.