AP

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్‌ చేయలేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ..

విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించింది సీపీఐ.. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ పాలస్తీనా విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.. ఇక, బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించిన ఆయన.. ఇండియా కూటమి సమన్వయ, ప్రచార, సోషల్ మీడియా కమిటీలు వేయడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.. అజెండా లేని పార్లమెంటు సమావేశాలలో జమిలీ చర్చ అంటూ అనధికార ప్రచారం చేశారని మండిపడ్డారు.

ఇక, మహిళా బిల్లు కేవలం ఎన్నికల జిమ్మిక్కుగా కొట్టిపారేశారు. ఇదే సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పేపర్ల లీకేజీలో సీఎం కేసీఆర్‌ మూడుసార్లు జైలుకెళ్లాల్సి వచ్చేది అంటూ సంచలన కామెంట్లు చేశారు.. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నవారు బయటే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కర్నాటకలో జైబజరంగ్, తమిళనాడులో సనాతన ధర్మం, బెంగాల్ లో ఈడీ దాడులు.. మోడీ ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు.. మోడీ, అమిత్‌షా అనుమతి లేకుండా చంద్రబాబును వైఎస్‌ జగన్ అరెస్టు చేయలేదన్న ఆయన.. సీపీఐని కలుపుకుంటే ప్రధాని మోడీకి కోపం వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి లాబీయింగ్‌ చేస్తారని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.