AP

ఏపీలో మొత్తం 4,02,21,450 ఓటర్లు.. 13.48 లక్షల ఓట్లు తొలగింపు..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్లు దాటింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసింది..

ఆ జాబితా ప్రకారం.. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450గా ఉంది.. అందులో పురుష ఓటర్లు 1,98,31791కాగా.. మహిళా ఓటర్లు 2,0385,851 మంది ఉన్నారు.. ఇక ఓటుహక్కు కలిగిఉన్న ట్రాన్స్ జెండర్ల సంఖ్య 3,808గా ఉంది.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 66,158 కాగా.. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు.. అత్యల్పంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది..

 

ఏపీ సీఈవో ఎంకే మీనా మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశాం అన్నారు.. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా కంటే 2.36 లక్షల మేర ఓటర్లు పెరిగారన్న ఆయన.. డిసెంబర్ 27 వరకు క్లైమ్స్ పరిశీలిస్తారని తెలిపారు. ఇక, వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన తుది ఓటర్ల జాబితా వ్రకటిస్తాం అన్నారు. యువ ఓటర్ల నమోదు తక్కువగా ఉంది.. మరింత ఎక్కువ మంది అర్హులైన యువతను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాం అని వెల్లడించారు.. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 13.48 లక్షల ఓట్లు తొలగించాం. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 15. 84 లక్షల ఓట్లను చేర్చాం తెలిపారు ఏపీ సీఈవో ఎంకే మీనా. కాగా, ఏపీలో ఓట్ల తొలగింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది.. కేంద్ర ఎన్నికల సంఘం వరకు పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే.