AP

యువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్న జగన్: సారథిగా బైరెడ్డి

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

 

 

తాజాగా యువజన విభాగంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. 64 మందితో కొత్త కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షులు, ముగ్గురు ఉపాధ్యక్షులు, ఎనిమిది జోనళ్లకు ఇన్‌ఛార్జీలు, ముగ్గురు అధికారిక ప్రతినిధులు, అయిదుమంది ప్రధాన కార్యదర్శులు ఇందులో ఉన్నారు. మిగిలిన వారందరూ కార్యదర్శులు, జాయింట్ కార్యదర్శులు.

 

యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు), తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.

 

జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్ (విజయనగరం), జోన్-2, ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్ (విశాఖపట్నం), జోన్-3, జక్కంపూడి గణేష్ (తూర్పు గోదావరి), జోన్-4 పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు (కృష్ణా), జోన్- 5 మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, జోన్- 6, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (తిరుపతి), జోన్- 7 ఎం మధుసూధన్ రెడ్డి (కర్నూలు), జోన్-8 ఎల్లారెడ్డి ప్రణయ్ కుమార్ రెడ్డి (అనంతపురం) అపాయింట్ అయ్యారు.

 

షర్మిలకు కాబోయే కోడలితో వైఎస్ విజయమ్మ: అపురూపమైన కానుక

అధికారిక ప్రతినిధులుగా తుమ్మా బాబుల్ రెడ్డి (పల్నాడు), జీవీ ప్రసాద్ (నెల్లూరు), కల్లం హరికృష్ణారెడ్డి (గుంటూరు)ను నియమించింది వైసీపీ అధిష్ఠానం. ప్రధాన కార్యదర్శులుగా ఛెట్టి వినయ్ (అల్లూరి సీతారామరాజు), ముండ్ల అక్షయ్ రెడ్డి (కడప), భవనం వంశీ రెడ్డి( గుంటూరు), కందుల దినేష్ రెడ్డి (ఏలూరు), మల్లెల పవన్ కుమార్ (బాపట్ల) అపాయింట్ అయ్యారు.