AP

సంక్రాంతి పండుగని కోడిపందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవు: ఏపీ పోలీసుల వార్నింగ్!!

సంక్రాంతి రోజులలో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కోడిపందాలు,పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది అని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని చెప్తున్నారు.

 

కోడి పందాలు, కోడి కత్తులు తయారీదారులు పేకాట,నిర్వహకుల పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు, వారిపై గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందుకున్న పోలీస్ బాస్ లు కఠిన చర్యలకు రంగంలోకి దిగారు.

 

కోడి పందాలు, జూదం,వంటి వాటి వలన ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశ పడి పందేలు కాసి వారి యొక్క ధనాన్ని నష్టపోతున్నారన్నారు. దీనివలన వారి కుటుంబాలలో పండగ పూట కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. కనుక ఎక్కడ కోడి పందాలు,జూదం నిర్వహించకుండా వుండేందుకు చర్యలు చేపదుతున్నామని చెప్తున్నారు.

 

గతంలో వీటిని నిర్వహిస్తూ,ఆడుతూ పట్టుబడిన వారు మరల వాటి జోలికి వెళ్లకుండా బైండవర్ చెయ్యడం జరుగుతుందన్నారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జిల్లాలో కోడి పందాలు నిర్వహించినా,పందేలు నిర్వహణకు స్థలాలు,భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొందరు యువకులు జూదం అనే వ్యసనానికి బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.

 

జూదంలో కోల్పోయిన డబ్బులను సంపాదించడానికి చిన్న చిన్న దొంగతనాలు చేయటానికి సైతం వెనుకాడట్లేదన్నారు.యువత ఇటువంటి కేసులలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇతర దేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్లే వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే సమయములో పాస్ పోర్ట్ పొందే సమయాలలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అదోగతిపాలవుతాయనీ హెచ్చరిస్తున్నారు.

 

ఎక్కడైనా కోడిపందేలు ఆడినా, జూదం ఆడినా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100,112 లేదా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 14500 లకి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని,సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఏపీ పోలీసులు చెప్తున్నారు.