AP

జగన్ ను భయపెడుతున్న బిజెపి..

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి జగన్ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అవి రాజకీయంగా ఎక్కడ వికటిస్తాయోనని భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా అవకాశం కోల్పోవడం, జగన్ తమను దారుణంగా దెబ్బతీశారని భావించి.. వారు ప్రతిఘటించేందుకు సిద్ధపడతారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారికి ఆసరా అవుతుంది. తప్పకుండా ఎక్కువమంది బిజెపి వైపు మొగ్గు చూపుతారు. టిడిపిలోకి చాన్స్ లేదు. జనసేనలో చేరినా పెద్దగా వర్కౌట్ కాదు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా.. రాజకీయంగా ఉనికి కావాలనుకుంటే బిజెపి వేదిక అవుతుంది. అందుకే జగన్ ఎక్కువగా భయపడుతున్నారు.

 

ఒకవేళ తెలుగుదేశం, జనసేన కూటమిలోకి బిజెపి చేరితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం.. ఆ కూటమివైపే టర్న్ అవుతుంది. అదే జరిగితే భారీ ఓటమి ఖాయమని జగన్ భయపడుతున్నారు. అందుకే బిజెపి ఒంటరి పోరు చేయాలని కోరుకుంటున్నారు. కానీ రాజకీయంగా ఉనికి కాపాడుకోలేకపోతే జాతీయ పార్టీగా పరువు పోతుందని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సీట్లు, ఓట్లు పెంచుకోవాలని భావిస్తోంది. బిజెపి రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుకు అనుకూలంగా ఉంది. బిజెపికి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఒంటరి పోరు కంటే ఒత్తుతో ముందుకు వెళ్లడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు జగన్ లో ఒక రకమైన కలవరపాటుకు కారణం అవుతున్నాయి. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత పోలరైజ్ అయితే.. కూటమిదే పైచేయి అవుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే బిజెపి అంటేనే ఒక రకమైన భయం జగన్ లో కనిపిస్తోంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వెంటాడుతోంది.