ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న 100రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు.