AP

టీడీపీకి ఎంపీ కేశినేని రాజీనామా – నెక్స్ట్ స్టెప్..!!..

కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. క్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసారు. దీంతో, కేశినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

 

రాజీనామాకు నాని సిద్దం:ఎన్నికల సమయంలో టీడీపీలో కీలక పరిణామం చేసుకుంది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తన్నట్లు ప్రకటించారు. విజయవాడ టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన సందేశంగా పార్టీ నేతల ద్వారా నానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా వెల్లడించారు. పార్టీ కార్యాక్రమాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని..విజయవాడ సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీంతో..కేశినేని నాని చంద్రబాబు చెప్పినట్లుగానే పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసారు. అందులో తాను ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు.

 

నాని అడుగులు ఎటు:టీడీపీని కేశినేని వీడటం కాయమైంది. దీంతో, రాజకీయంగా ఆయన తరువాతి అడుగులు ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. నానికి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారంతో ఆ పార్టీలో నాని చేరే అవకాశం లేదని చెబుతున్నారు. వైసీపీ నేతలతో కొంత కాలంగా నాని సన్నిహితంగా ఉంటున్నారు. ప్రజా జీవితం లో మంచి చేసే వారిని ప్రోత్సహించాలని..ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చెప్పుకొచ్చారు. నాని వైసీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని అప్పట్లోనే వైసీపీ ముఖ్యనేతలు స్పష్టం చేసారు. ఇప్పుడు నాని ఇక టీడీపీ వీడాలని నిర్ణయించటంతో ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే కోణంతో చర్చ జరుగుతోంది. ఇప్పటికే నాని తాను పార్టీ మారుతానని క్లారిటీ ఇచ్చారు.

 

పోటీకి సిద్దమని సంకేతాలు:తాజా పరిణామాల పైన స్పందించిన ఆయన త్వరలోనే సరైన నిర్ణయం ఉంటుందన్నారు. తాను పోటీకి దూరంగా ఉండాలన్నా..విజయవాడ ప్రజలు ఊరుకోరన్నారు. తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో..నాని వైసీపీ లేక ఏదైనా పార్టీలో చేరుతారా..స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. నానితో పాటుగా విజయవాడ లోక్ సభ పరిధిలో ఆయన మద్దతు దారులు అసెంబ్లీ అభ్యర్దులుగానూ పోటీ చేయించేలా ఆలోచన జరుగుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో నానితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కీలకమైన విజయవాడలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..కేశినేని నాని నిర్ణయాలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతున్నాయి.