National

భార‌త ఆర్థిక వృద్ధిపై రిపోర్టు ఇచ్చిన ఐక్య‌రాజ్య‌స‌మితి..

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ తన రిపోర్టులో తెలిపింది. ఉత్పత్తి, సర్వీసెస్ రంగంలో బలమైన వృద్ధి కారణంగా భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది.