AP

టీడీపీ ఏ వర్గానికి ఎన్ని సీట్లు – జగన్ లెక్కలను సరి చేస్తాయా..!?

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. చంద్రబాబు, జనసేన తమ తొలి అభ్యర్దుల జాబితా ప్రకటించాయి. సీఎం జగన్ సామాజి లెక్కలే ప్రధానంగా ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఇందులో కొందరు సీనియర్ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. ప్రకటించిన సీట్లలో అమలు చేసిన సామాజిక లెక్కలు ఇప్పుడు జగన్ సమీకరణాలను సరి చేస్తాయా లేదా అనే చర్చ మొదలైంది.

 

సామాజిక లెక్కలు : ఏపీలో ఇప్పుడు ఎన్నికల యుద్దం సామాజిక సమీకరణంగా మారుతోంది. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల కేటాయింపులోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా నియిమించిన ఇంఛార్జ్ ల్లోనూ బీసీలకే ఎక్కువగా కేటాయించారు. ఇప్పుడు టీడీపీ జాబితా ప్రకటించారు. రెండు పార్టీలు కలిపి 99 మంది అభ్యర్దులను ఫైనల్ చేసారు. అందులో పురుషులు 86 మంది ఉండగా మహిళలు 13 మంది ఉన్నారు. టీడీపీ నుంచి తొలి సారి 24 మంది బరిలో నిలిచారు. మరో 57 స్థానాలకు టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది.

ఏ వర్గానికి ఎన్ని సీట్లు : జనసేకు 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఖరారైనా పవన్ కేవలం అయిదు స్థానాలకే అభ్యర్దులను ప్రకటించారు.ఇక, టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలను గమనిస్తే జగన్ కు ధీటుగానే కసరత్తు చేసినట్లు స్పష్టం అవుతోంది. బీసీ వర్గాలకు 20 సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 20 స్థానాలు రెండు పార్టీల నుంచి ప్రకటించారు. ఎస్టీలకు 3 స్థానాలు ఖరారయ్యాయి. కాపులకు ఈ రోజు ప్రకటించిన జాబితాలో 10 స్థానాలు కేటాయించారు. కమ్మ వర్గానికి 21 సీట్లు ఖరారయ్యాయి. వైశ్య వర్గానికి రెండు సీట్లు పరిమితం చేసారు. క్షత్రియ వర్గానికి నాలుగు సీట్లను టీడీపీ కేటాయించింది. వెలమ వర్గానికి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ప్రకటించారు.

 

జగన్ లెక్కలు మారుతాయా : మైనార్టీలకు టీడీపీ నంద్యాల సీటు మాత్రమే కేటాయించింది. టీడీపీ – జనసేన తాజా జాబితాతో వైసీపీ అలర్ట్ అయింది. వచ్చే నెల 3న అద్దంకిలో జరిగే సిద్దం సభ తరువాత పార్టీ అభ్యర్దులను..మేనిఫెస్టో ప్రకటిస్తామని పార్టీ ప్రకటించింది. టీడీపీలో సీట్లు దక్కని ఆవావాహులను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీప వ్యూహాలు సిద్దం చేస్తోంది. అదే సమయంలో అవసరమైతే ప్రకటించిన ఇంచార్జ్ ల్లోనూ మార్పులు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో పవన్ తాను పోటీ చేసే స్థానం ప్రకటించలేదు. ఇక, జనసేన కేవలం 23 స్థానాలకే పరిమితం కావటంతో వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ పొత్తు పైనా స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు లిస్లు ఖరారు కావటంతో..జగన్ తన లిస్లులో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.