టీడీపీ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విరుచుకుపడ్డారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసారు. ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. అధికారం అంటే వ్యామోహం లేదన్నారు. అధికారం పోతుందనే భయం తనకు లేదన్నారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు. అరడజను పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు. అయినా, తాను తగ్గేదే లే అని తేల్చి చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు.
ప్రతిపక్షాలపై ఫైర్ అద్దంకి సిద్దం సభలో ప్రతిపక్షాలను జగన్ టార్గెట్ చేసారు. చరిత్ర ఉన్నంతకాలం ప్రతీ పేదవాడు ఇంట్లో..వారి గుండెల్లో నిలిచిపోవాలనే తపనతోనే పని చేస్తున్నానని వివరించారు. మాట ఇస్తే తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. మాట ఇస్తే నాయకుడు అనే వాడు తప్పకూడదని..మడమ తిప్పకూడదని చెప్పుకొచ్చారు. 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసామన్నారు. 2014 హామీలు ఇచ్చిన మూడు పార్టీలు వాటిని అమలు చేయకుండా, తిరిగి ఇప్పుడు మరసారి మోసం చేసేందుకు వస్తున్నాయని విమర్శించారు. తన పైన అరడజను పార్టీలు బాణాలు ఎక్కు పెట్టాయన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు అనే అస్త్రం ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని..చేసేది మాత్రమే చెబతామని జగన్ తేల్చి చెప్పారు. అందులో చెప్పిన ప్రతీ ఒక్కటి చేస్తామని స్పష్టం చేసారు.
మాట ఇస్తే తగ్గేదే లేదు జగన్ మాట ఇచ్చాడు అంటే తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. 175-25 స్థానాలు గెలవటానికి మనమంతా సిద్దం కావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు తాను ఇచ్చిన మాటను గుర్తు చేసారు.పేదవాడి భవిష్యత్ బాగుండాలంటే వైసీపీ గెలవాలని జగన్ సూచించారు. మంచి కొనసాగాలంటే మనం పని చేయాలన్నారు. బాబు అనే మాయలోడి వలలో పడవద్దని కోరారు. పేదల కోసం ఒంటరిగానే సింహంలా తోడుగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు. తాను పొత్తులు, ఎత్తులు, మోసాలు, అబద్దాలు నమ్ముకోలేదని వివరించారు. సీఎంగా జగన్ వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఏటా రూ 1.50 లక్షల కోట్లుగా వివరించారు. తాను అమలు చేసిన 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కి ఏటా 73 వేల కోట్లు కావాలని వివరించారు.
చారిత్రాత్మక విజయం ఖాయం తాజాగా ఇచ్చిన ఏడో హామీకి 87 వేల కోట్లు కావాలని లెక్కలు చెప్పారు. తన అయిదేళ్ల పాలనలో 2.70 లక్షల కోట్ల నగదు బదిలీ చేసామని వివరించారు. నవరత్నాల్లో అన్ని పథకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు ఓటు వేయటం అంటే పథకాలు అన్నీ రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని పేర్కొన్నారు. ఇది ఎన్నికలు మాత్రమే కాదని..పేదలు – పెత్తందార్ల మధ్య జరుగున్న యుద్దంగా పేర్కొన్నారు. విశ్వసనీయత -వంచనకు మధ్య జరుగుతున్న యుద్దంగా వివరించారు. వంచన చేసే వారిని ఓడించేందుకు సిద్దమేనా అని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయాలన్నారు. పాలనలో ఎక్కడా తగ్గలేదని..వై నాట్ 175 నినాదంతో మందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జగన్ అనే నేను..మరో అయిదేళ్లు సేవకుడిగా సిద్దమని జగన్ సిద్దం సభా వేదికగా ప్రకటించారు.