AP

జగన్ కు మరో షాక్..! చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని..

ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.

 

జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. పోలవరంపై కీలక ఆదేశాలు

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. పోలవరంతోపాటు పలు ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగకపోతే.. అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు.

 

ముందుగా పోలవరం ప్రాజెక్టుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. జనవరి నెలలో ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 51 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1328 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరగాల్సిందేనని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.