AP : ప్రతిపక్ష హోదాపై YCP నేతలు కావాలనే బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరఫున కోరుతున్నట్లు తెలిపారు.
