AP

ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి..: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, మార్చి 10 :

– జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఎంఎస్ఎంఈ సర్వే, పి4 సర్వే, తదితర అంశాలపై డ్వామా పిడి, డిఎల్డివోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, ఏపీడీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*

 

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్లకు సంబంధించి 1,901 మంజూరు కాగా, 210 పెండింగ్ ఉన్నాయని, బీటీ రోడ్లకు సంబంధించి 9 మంజూరు కాగా, 3 పెండింగ్ ఉన్నాయని, వాటిని వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. సిసి డ్రైన్స్ కి సంబంధించి 470 మంజూరవగా, 182 గ్రౌండింగ్ కాగా, మిగిలిన వాటిని గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. పశువుల షెడ్లకు సంబంధించి 1,737 మంజూరు కాగా, 492 పెండింగ్ ఉన్నాయని, వాటిని ఏర్పాటు చేయాలన్నారు. పశుగ్రాసం పెంచడానికి సంబంధించి 1,000 ఎకరాలలో చేపట్టాలని లక్ష్యం విధించగా, ఇప్పటివరకు 31 శాతం లక్ష్యం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వాటికి మంజూరులు తీసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పల్లె వనాలకు సంబంధించి 31 చేపట్టాల్సి ఉందని, వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఖాళీగా ఉన్న 72 ఫీల్డ్ అసిస్టెంట్లు/ సీనియర్ మేట్లను వారం రోజుల్లో నియమించాలన్నారు. లేబర్ బడ్జెట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫారంపాండ్ పనులకు సంబంధించి 8,670 లక్ష్యం విధించగా, ఇప్పటివరకు 5,341 పూర్తి కావడం జరిగిందని, మిగిలిన వాటికి మంజూరులు తీసుకుని పనులను గ్రౌండింగ్ చేయాలన్నారు. 7,862 వ్యక్తిగత ఇంకుడు గుంతలు చేపట్టాలని లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 5,320 ఇంకుడు గుంతలు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి 15 లోపు పూర్తిచేసేలా చూడాలన్నారు. అమృత్ / మినీ అమృత్ సరోవర్ పనులకు సంబంధించి 763 మంజూరు కాగా, 396 పూర్తి కావడం జరిగిందని, మిగిలినవి వారంలోపు గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. రూఫ్ టాఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కు సంబంధించి 400 మంజూరు కాగా, 354 పూర్తిగా కావడం జరిగిందని, మిగిలినవి 46 గ్రౌండ్ కావాలని ఆదేశించారు.*

 

– *జి.ఎస్.డబ్ల్యు.ఎస్ అంశాలకు సంబంధించి సర్వే, ఎనర్జీ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, వార్డు ఎనర్జీ అసిస్టెంట్లు, తదితరులు తక్కువగా అటెండెన్స్ నమోదు చేస్తున్నారని, సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు పూర్తిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసెస్, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ కు సంబంధించి పెండింగ్ పూర్తి కావాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేకు సంబంధించి పెండింగ్ ఉన్న 21,883 మంది సర్వే వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పి4 సర్వేకు సంబంధించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి సలీమ్ భాష, డిపిఓ నాగరాజు నాయుడు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు.*

 

———————————————-

DIPRO.I&PR.ATP..