అనంతపురం :
అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*l
స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్న 61 మంది పిటీషనర్లు
చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ
నిర్దిష్ట గడువులోపు చట్ట పరిధిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి సోమవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు.
జిల్లా ఎస్పీ నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారులు వారి రాతపూర్వకమైన అర్జీలను అందజేసి స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫిర్యాదీదారులు ఇచ్చిన అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి అర్జీలను పరిశీలించి, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని అర్జీదారులకు జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువు లోపు చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ లకు, కార్యాలయాలకు వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పిజిఆర్ఎస్ సెల్ కు పంపాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు.
“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో ఈ రోజు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్థి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 61 అర్జీలు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, మహిళా డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.