ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నియోజవర్గం పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇకపై నియోజక వర్గ అభివృద్దిపై వరుస రిప్యూలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అర్బన్ డెవలప్ మెంట్ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొందరి వల్ల పోలీస్ శాఖ చులకన అవుతుంది..
పిఠాపురంలోని నాలుగు పీఎస్ ల పరిధిలోని పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదక తీసుకోవాలని అధికారులను కోరారు. కొందరి అవినీతపరుల వల్ల పోలీస్ శాఖ చులకన అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరలోనే పరిష్కరించాలని చెప్పారు. పిఠాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ ను సీహెచ్‌సీ నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచామని అన్నారు. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయని సమీక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి..
నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ముఖ్యంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ వద్ద తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం లోకల్ లో తాగు నీటి సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశామని చెప్పుకొచ్చారు. పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపడానికి రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టామని అన్నారు. అలాగే 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చామని తెలిపారు.
ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికారులపై ఉంది..
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నామన్నారు. నిధులను సరిగ్గా వాడి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికారులపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనను నిర్దేశిత గడువులోగా కంప్లీట్ చేసే బాధ్యత అధికారులపై మాత్రమే ఉందని అన్నారు. పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోందని తెలిపారు. విద్యుత్ అంతరాయ సమస్య ఉందని తెలియగానే టిడ్కో గృహాల దగ్గర రూ.3 కోట్లతో 5 ఎం.వీ.ఎ సామర్థ్యంతో కొత్త సబ్ స్టేషన్ పనులు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.