ఏపీ లిక్కర్ పాలసీలో ట్విస్టులు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎవరెవరికి సంబంధం ఉంది.. మద్యం పాలసీ ఎలా తయారు చేశారు.. ఆర్గనైజ్డ్ గా ముడుపులు ఎలా మళ్లించారు.. కుట్రలకు కేంద్రస్థానం ఏంటి.. సప్లై, సేల్స్ కు ఆఫ్ లైన్ ఎందుకు పెట్టారు.. ఇదంతా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. కానీ దగ్గరి నుంచి చూస్తే ఒక్కో లెక్క బయటికొస్తుంది. ఇప్పుడు సిట్ కూడా అదే చేస్తోంది.
తాజాగా ఏపీ లిక్కర్ స్కాంలో మరో వికెట్ పడింది. S.P.Y ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. హైదరాబాద్.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న సిట్.. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ముడుపుల వ్యవహారంలో సజ్జల శ్రీధర్‌రెడ్డిది కీలక పాత్రగా అనుమానిస్తోంది. ఈ కేసులో A-6గా ఉన్నారు సజ్జల శ్రీధర్‌రెడ్డి.
మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర అంటూ సిట్ అధికారులు తెలిపారు. మధ్యం కుంభకోణంలో ఇప్పటికే ఏ1రాజ్ కసిరెడ్జి, ఆయన తోడల్లుడు చాణక్య ఏ8 ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..
ఇక తాజాగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి, వందల కోట్లు వెనకేసుకున్నట్లుగా సిట్ అధికారులు సమాచారం సేకరించారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన కొద్ది నెలలకే.. శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో హైదారాబాద్ వేదికగా ఒక మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. డిస్టరీలకు సంబంధించి అందరి యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. కమీషన్ ఇచ్చిన వాళ్లకే లిక్కర్ ఆర్డర్స్ వస్తాయి.. ఇవ్వని వాళ్లకి ఆర్డర్స్ అయితే రావు అని సజ్జల శ్రీధర్ ఆదేశించారు. దీనికి కొందరు అంగీకరించారు. మరికొందరు నిరాకరించారు. కమీషన్లు ఇచ్చేందుకు సరేనన్న వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి.. ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉంచారు. కమీషన్ మొత్తం 2024నాటికి 20శాతం వరకూ పెంచడంలోనూ శ్రీధర్‌రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ అధికారులు గుర్తించారు.
నూతన మద్యం విధానం ముసుగులో భాగంగా.. ప్రతి నెల రూ.50 నుండి 60 కోట్ల మేర ముడుపులు ఎలా కొల్లగొట్టాలి అనే దానిపై.. చర్చించుకునేందుకు చేపట్టిన సమావేశాలన్నిటిలోనూ.. శ్రీదర్ రెడ్డి తరచూ మిథున్ రెడ్డితో, సాయి రెడ్డితో, రాజ్ కసిరెడ్డి, మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి సత్యప్రసాద్ వీళ్లందరితో కలిసి.. ఎలా లిక్కర్ మాఫియా చేయాలి అన్న కోణంలో.. కీలకమైన బాధ్యతలు తీసుకుని.. దీని పైన తరచూ వీళ్లందరితో చర్చలు జరిపారు. ఇక కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు.
సొంత ప్రభుత్వం.. సర్కారీ మద్యం దుకాణాలు.. సొంత బ్రాండ్లు! ఇలా.. తామే ఆర్డర్లు పొంది, తమ డిస్టిలరీలలో తయారైన నాసిరకం మద్యాన్నే సరఫరా చేశారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలో మిథున్‌రెడ్డికి వచ్చేలా ప్లాన్ చేశారు. మద్యం సరఫరా ఆర్డర్లను అడ్డుపెట్టుకుని.. ముడుపులు వసూలు చేయొచ్చనే ఆలోచన అందించడంలో శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్ర సిట్ అధికారులు తెలిపారు. ఆయన్ను కస్టడీకి తీసుకున్నాకా.. లోతుగా విచారించి లిక్కర్ మాఫియాకు సంబంధించి.. వైసీపీ ప్రభుత్వం పెద్దల ప్రమేయం, ఇతర వివరాలు రాబట్టే అవకాశం ఉంది