2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సీబీఐ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఓ కొలిక్కిరాలేదు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేందుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.
తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబరులో కూడా సునీత, తన భర్తతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజాగా మరోసారి తన తండ్రి హత్య అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.