AP

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..

2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

2017 ఆగస్టు 18న ఏపీలోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. జిల్లాలోని ఓ స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్‌ ఫ్యాన్‌ కు వేలాడుతూ కనిపించింది. అయితే ఈ కేసును వైసీపీ హయాంలో ఈ కేసు సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతల హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది