AP

వేమన స్వామి సన్నిధిలో కదిరి ఈవో వెండి శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డిలకు ఘన సత్కారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమన స్వామి ఆలయాన్ని కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెండి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్థానిక నేత నంద వేమరెడ్డి ఆధ్వర్యంలో ఈవో వెండి శ్రీనివాస్ మరియు పవన్ కుమార్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వేమన స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దేవాలయాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని నంద వేమరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.