శ్రీ సత్య సాయి జిల్లా
తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప ను హత్య చేసిన నిందితులు అరెస్ట్
మీడియా సమావేశంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి కామెంట్స్
ఈశ్వరప్ప ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు
హత్య చేసిన నిందితులు హరి,శంకరప్ప, గంగులప్ప,చిన్నప్ప లు అరెస్ట్
ఐదు రోజుల క్రితం హరి భార్యను తీసుకువెళ్లిన ఈశ్వరప్ప
హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం
తిరుపతి జిల్లా గూడూరులో ఈశ్వరప్ప హరి భార్య ఉన్నట్లు గుర్తించము
అక్కడి నుండి వారిని తీసుకువచ్చేందుకు ఫిర్యాదుదారుడు హరితో కలిసి హెడ్ కానిస్టేబుల్ వెళ్లాడు
హరి ఇచ్చిన సమాచారంతో వారి బంధువులు పక్కా ప్లాన్ తో వేటకొడవలతో పోలీస్ స్టేషన్ వద్ద కాపు కాచారు.
ఐదో తేదీ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ వద్ద కారులో నుంచి ఈశ్వరప్ప దిగగానే హరితో పాటు బంధువులు చిన్నప్ప శంకర గంగులప్ప వేటకొడువలితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు.
నిందితులను రాగినేపల్లి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి వేట కొడవలి కారు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివ నారాయణస్వామి వెల్లడించారు

