APPOLITICS

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం ప్రకటించినట్టున్నారు.చతుష్టయంలో ఒకరైన రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి సంస్థల్లో సోదాలు ప్రారంభించారు. అయితే ఒక్క మార్గదర్శిలోనే కాదు.. చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థల్లో తనిఖీలు చేపడుతున్నామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మార్గదర్శి తప్పించి ఇతర చోట్ల జరుగుతున్న తనిఖీల సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను ఫిక్స్ డ్ అకౌంట్ లోకి మార్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారన్నది ప్రభుత్వ వాదన

. Jagan- Ramoji ఇప్పటికే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి పై న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటీషన్ ఇంప్లీడ్ అయ్యింది. చిట్స్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి. ఫిక్స్ డ్ డిపాజిట్లుగా మార్చేస్తున్నారని దశాబ్ద కాలం కిందట నుంచే ఉండవల్లి ఆరోపిస్తూ వస్తున్నారు. తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలం విచారణ సాగగా.. రామోజీరావుపై మోపబడిన అభియోగాన్ని కొట్టివేస్తూ 2018 డిసెంబరు 31న అప్పటి ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ ఉండవల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఆయన వేసిన పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. డిసెంబరు 2న కేసు హీయరింగ్ కు రానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మార్గదర్శిని టార్గెట్ చేసుకుంటూ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. Jagan- Ramoji అయితే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత రామోజీరావు మార్గదర్శిపై పడడం మాత్రం కాస్తా విస్మయం వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్గదర్శి విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు కేసు విచారణ సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ విషయం తేల్చేందుకే స్ట్రాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారన్నది అందరి అనుమానం. మొత్తం వివరాలను సేకరించి సుప్రీం కోర్టు ముందు ఉంచేందుకే అధికారులు గోప్యత పాటిస్తున్నారని టాక్ నడుస్తోంది. సోదాలన్నీ పూర్తయ్యాక వివరాలు వెల్లడించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.