AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు: ‘బాల్య వివాహం నేరం – చట్టం పట్ల అవగాహన అవసరం’

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి లో బాల్య వివాహాలను అరికట్టకడం పైన అవగాహన సదస్సు
స్ధానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈ రోజు బాల్య వివాహలను అరికట్టడం పైన అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సు లో సమత సొసైటీ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అధ్వర్యంలో లో భాగంగా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు వాటి నివారణ మార్గాలు గురించి విద్యార్థులుకు తెలియచేశారు. అమ్మాయిలు 18సం లోపు , అబ్బాయిలు 21 సం లోపు వివాహాలు చేసుకోవడం నేరం అని తెలియచేశారు
ఐసిడిఎస్ ఇంచార్జి మమత,మహిళా పోలీస్ రూప గారు బాల్య వివాహలు చేసుకోవడం నేరం దానికి సంబంధించిన చట్టాలు వాటి శిక్షలు గురించి అవగాహన కల్పించారు.
పోలీస్ కానిస్టేబుల్ చలపతి మాట్లాడుతూ బాల్య వివాహ వల జరిగే నష్టాలు వాటి చట్టాలు, శిక్షలు గురించి తెలియచేశారు. విద్యార్థులు బానిసగా మారి వారు జీవితాలను నాశనం చేసుకోకూడదు అని తెలియచేశారు.
ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ కే రమా గారు, విభాగ అధిపతులు పి భాస్కర్, ఎస్ మహబూబ్ బాషా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.