ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు.
ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు వాహనాలు నడుపుతూ ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పారు. డిఎస్ఎమ్ వరప్రసాద్ గారు మాట్లాడుతూ రోడ్డు పైన వాహనాలు నడుపుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ గురించి , హెల్మెట్ లేకుండా టు వీలర్ వాహనం నడపరాదు అని, సెల్ ఫోన్లు మాట్లాడుతాడు వాహనం నడపరాదు అని రోడ్డు పైన వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియచేశారు .ఈరోజు ఈ మాసోత్సవాలు భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్
కే .రమా గారు మరియు విభాగాధిపతులు పి భాస్కర్ గారు, మహబూబ్ బాషా గారు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

