AP

కదిరిలో ఘనంగా సింగిల్ వికెట్ క్రికెట్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం

కోచింగ్ క్యాంపు క్రీడాకారులకు క్రికెట్ పోటీలు
కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు రెండు రోజులు గా సింగల్ వికెట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.ఇందులో అండర్ 19 విభాగం లో నరసింహ, అండర్ 16 విభాగం లో దేవేంద్ర, అండర్ 12 విభాగం లో శివాజీ విజేతలు అయ్యారు. సంక్రాంతి సంబరాలు లో భాగంగా ACA Subcenter క్రీడాకారులకు ఈ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందించారు. అలాగే కదిరి మండల క్రికెట్ సంఘం తరఫున కార్యదర్శి ఎల్లప్ప క్రీడాకారిణి ధరణి కి Bat అందించారు. అలాగే ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ తరఫున క్రీడాకారులకు బ్లూ టూత్ స్పీకర్, మైక్ ను అందించారు. ఈ కార్యక్రమం లో కోశాధికారి ముబారక్, ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు….