AP

కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
  • కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు
  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
  • సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్
  • భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్ దే
  • పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకం
  • పటేల్, పట్వారి వ్యవస్థలకు చరమ గీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్
  • సంక్షేమ పథకాలు పేరుమీద పేదలకు కిలో రెండు రూపాయలు బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకం
  • అందుకే ఎన్టీఆర్ పూజ్యుడు చిరస్మరణీయుడు
  • రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాతనే
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు
  • ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ద్వారా పేదలకు రక్తాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు
  • బసవ రామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు విశిష్ట సేవలు
  • పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్న మూలాలు మర్చిపోకుండా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
  • ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే రాజకీయాలలో ఆల్ టైం రికార్డ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు దేనని తెలిపారు పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన విషయం అన్నారు.పటేల్, పట్వారి వ్యవస్థలకు చరమా గీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాలు పేరుమీద పేదలకు కిలో రెండు రూపాయల బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకం అన్నారు. అందుకే ఎన్టీఆర్ పూజ్యుడు, చిరస్మరణీయుడు అని తెలిపారు. రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాతనేనని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా పేదలకు రక్తాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టామన్నారు బసవ రామ తారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు విశిష్ట సేవలు అందించిందన్నారు. పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్న మూలాలు మర్చిపోకుండా ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. అంతకుముందు జోహార్ ఎన్టీఆర్ అంటూ టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.