AP

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర ఉన్నట్లుగా బయటపడింది. ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీప బంధువు.

పేరు చివర తోక లేదని ఆయన ఏదో అనుకున్నారు కానీ.. గుట్టుగా కావాలనే ఉంచుకున్నారని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఆయన కడపలో పని చేసేవారు. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వారికి జైలు కాదు ఇల్లు అన్నట్లుగా చూసుకున్నారు.

కోర్టు అనుమతి లేకుండా ఖైదీల్ని కోర్టులకు తీసుకెళ్లడం లాంటివి చేశారు. ఆయన ఘనకార్యాలపై చాలా వరకూ అందిరికీ క్లారిటీ వచ్చింది. ఆయన తీరును సీబీఐ కూడా కోర్టులో తప్పు పట్టింది. హఠాత్తుగా ఆయనను కోస్తాంధ్రకు ఎందుకు వేశారో కానీ అంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాజమండ్రి జైలు ఇంచార్జ్ సెలవు పెడితే ఆ క్యాడర్ అధికారిని ఇంచార్జ్ గా నియమించాల్సింది పోయి తానే ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారు. అంత అవసరం ఏమి ఉందో.. ఏం చేయబోతున్నారో వారికే తెలియాలి.

చంద్రబాబునాయుడు సతీమణి ములాఖత్ అడిగితే తిరస్కరించారు. ఎందుకంటే అత్యవసరం ఏమీ లేదు అని అని తీర్మానించేసుకున్నారు. జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉంటే. రోజుకు మూడు ములాఖత్ లు అయ్యేవి. అవి ఎలా అయ్యేవో మరి. జైల్లో చంద్రబాబుకు ఉన్న భద్రతపై బయట ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదో కుట్ర చేసే జైల్లో పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రిమినల్ మైండ్ పాలకులు ఎప్పుడు ఏమి చేస్తారో చెప్పడం కష్టం. చంద్రబాబుపై ఇప్పటికే అనేక సార్లు స్ట్రాటజిక్ గా హత్యాయత్నాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.