APNational

ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక – ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది.

జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.

చంద్రబాబు అరెస్ట్ వెనుక:స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టు పైన వాదనల తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయితే, అసలు చంద్రబాబుకు ఈ స్కాంలో ప్రమేయం లేదని టీడీపీ వాదిస్తోంది. ఇదే సమయంలో పూర్తి ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసిందని ప్రభుత్వంలోని ముఖ్యులు…వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సైతం పూర్తి ఆధారాలు..సాక్ష్యాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కేంద్ర విచారణ సంస్థల అంశం పైన పెద్దగా ప్రస్తావన రావటం లేదు. కానీ, చంద్రబాబు స్కిల్ స్కాం కేసు వెనుక అసలు విషయాలు వెలుగులోకి తెచ్చింది కేంద్రం సంస్థలేనని స్పష్టం అవుతోంది.